Featured

Actor Subbaraya Sharma : బాబూమోహన్, కోటా కి మధ్య గొడవలు వాస్తవం.. ఎన్టీఆర్ నన్ను ఇంటికి పిలిపించుకుని అరగంట నాతో ఏం మాట్లాడారంటే…: నటుడు సుబ్బరాయ శర్మ

Actor Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ‘ఒంటెద్దు బండి’ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయన ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

బాబు మోహన్ కోటా కి మధ్య గొడవలు…

అప్పట్లో అందరు కమెడియన్స్ కి పని దొరికేదని, అన్ని సినిమాల్లోనూ కమెడియన్స్ బాగా ఉండేవారంటూ చెప్పిన సుబ్బరాయ శర్మ గారు తాను సినిమాల మీదే దృష్టి సారించకపోవడం వల్ల ఇంకా ఎక్కువ సినిమాలను చేయలేక పోయానంటూ చెప్పారు. ఇక అప్పట్లో బ్రహ్మానందంతో గొడవ పడి ఏవిఎస్ 20 మంది కమెడియన్స్ తో కలిసి మీటింగ్ పెట్టాడు. కానీ ఆ తరువాత తానే బ్రహ్మానందంతో కలిసి నటించాడు కదా అలా ఏవో క్లాషెస్ ఉన్నా కూడా సినిమాలలో కలిసి నటించేవారుంటూ చెప్పారు. అలానే బాబూమోహన్ కోటా కి చిన్న డిఫరెన్స్ వచ్చింది. అప్పట్లో ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్ కాబట్టి చాలా సినిమాలు కలిసి చేసారు. అలా చేస్తున్నపుడు ఇగో క్లాషెస్ కామన్, అలా గొడవ వచ్చినా మళ్ళీ అవే సర్దుకున్నాయి. వాళ్లిద్దరూ కలిసి మళ్ళీ నటించారు అంటూ చెప్పారు.

ఎన్టీఆర్ నాతో అరగంట మాట్లాడారు…

సినిమాల్లో అందరితో నటించినా సీనియర్ ఎన్టీఆర్ గారితో నటించలేదనే కొరత ఉండిపోయింది అంటూ సుబ్బరాయ శర్మ తెలిపారు. మొదట్నుంచి అయిన నా అభిమాన నటుడు అంటూ చెప్పారు. అయితే ఆయన విశ్వామిత్ర సినిమాను ఆయనే డైరెక్ట్ చేయాలనుకున్నపుడు నన్ను ఇంటికి రమ్మని పిలిపించారు. వెళితే అరగంట సేపు నాతో మాట్లాడి టీవీ రంగం ఎలా ఉందని అడిగి అలానే నా స్వస్థలం, వ్యక్తిగత వివరాలను అడిగి దాదాపు అరగంట నాతో మాట్లాడారు, అది చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పారు. అయితే ఆ సినిమాలో నన్ను తీసుకోలేదు నేను ఆయన అనుకున్న పాత్రకు నచ్చనని అనుకున్నారేమో కానీ ఆయనతో ఆ అరగంట మాట్లాడటమే నా అదృష్టంగా భావిస్తాను అంటూ ఆయన అభిమానాన్ని చెప్పారు సుబ్బరాయ శర్మ.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago