Nagababu: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో నటుడిగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా చిత్రాలను నిర్మిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇక నాగబాబు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన సినిమాలకు రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి తరచూ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా సినీ విమర్శకుల గురించి నాగబాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాగబాబు సినీ విమర్శకుల గురించి మాట్లాడుతూ… సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారని చాలామంది మాట్లాడుతున్నారు అయితే సినిమాల వల్ల ఎవరు చెడిపోరని సినిమాలు కేవలం ఒక వ్యాపారం మాత్రమేనని తెలిపారు.
సినిమాలలో జరుగుతున్న హింస వల్ల చాలామంది చెడిపోతున్నారని భావించినప్పుడు సినిమాల ద్వారా చూపించే మంచి వల్ల కూడా చాలామంది బాగుపడాలి కదా అని ప్రశ్నించారు. సినిమాలు బాగుపడాలని, చెడిపోవాలని ఉద్దేశంతో ఎవరు చేయరని ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నారని తెలిపారు.
ఇక సినిమాలలో ఏదైనా ఓవర్ గా ఉంటే సెన్సార్ ఉంది.
సినిమాల వల్ల చెడిపోతున్నారని భావించే వారికి నేను చెప్పే సమాధానం ఇదే సినిమా ఒక వ్యాపారం మాత్రమే…కుహనా మేధావులు ఏడవకండి అంటూ ఈయన వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఈయన చేసినటువంటి ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన వ్యాఖ్యలపై కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ నాగబాబు చెప్పినది నిజమే నంటూ ఈ ట్వీట్లను షేర్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…