Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో సుమన్!
Actor Suman: ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పోటీగా నటుడు సుమన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోయారు. ఈ విధంగా ఇండస్ట్రీలో చిరంజీవి సుమన్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడి ఉండేది.ఇలా ఇండస్ట్రీలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న సుమన్ కెరియర్ కు ఒక్కసారిగా బ్లూ ఫిలిం కేస్ బ్రేకులు వేసింది.
సుమన్ గురించి లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ గుంఢా యాక్ట్ పెట్టడం ఇండస్ట్రీని ఊపేసింది. ఈ ఇష్యూ జరిగే టైంలో సుమన్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా సుమన్ ను ఈ కేసులో ఇరికించి ఉద్దేశపూర్వకంగానే తనని జైలుకు పంపించారని ఈ కుట్ర వెనుక ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటుడు హస్తం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇండస్ట్రీలో సుమన్ ఎదుగుదల చూసి ఓర్వలేక అతనిని ఇండస్ట్రీలో తొక్కేయాలన్న ఉద్దేశంతోనే అతనిపై ఇలాంటి కుట్ర జరిగిందని వార్తలు వచ్చాయి.అయితే ఆ హీరో గురించి వస్తున్న వార్తల పట్ల ఏ విధమైనటువంటి ఆధారాలు లేకపోవడంతో ఇది కాస్త రూమర్ గానే మిగిలిపోయింది.ఇక సుమన్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే పెద్ద పెద్ద హీరోలు సైతం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకునేవారు. అంతటి పాపులారిటీ ఉన్న సుమన్ ఒక్కసారిగా ఈ కేసులో ఇరుకోవడంతో ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
ఇలా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఈయన తిరిగి తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.కొద్దిరోజుల పాటు ఈయనకు తెలుగులో ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదు అనంతరం సినిమాలలో కొన్ని కీలక పాత్రలలో మాత్రమే నటించే అవకాశం వచ్చింది కానీ హీరోగా చేసే అవకాశాలు మాత్రం రాలేదు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో సుమన్ కి ఎవరు ఫోన్ చేసినా పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని ప్రశ్నించే వాళ్ళు. అయితే ఇండస్ట్రీలో తనకు ఎంతో సన్నిహితుడైన భానుచందర్ తోసుమన్ మాట్లాడుతూ దయచేసి తనకు ఫోన్ చేయొద్దని సుమన్ చెప్పారంటూ ఎన్నోసార్లు భానుచందర్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇలా అనవసరంగా సుమన్ ను కేసులో ఇరికించి తన కెరియర్ మాత్రం పూర్తిగా దెబ్బతీశారనే చెప్పాలి. ఇప్పటికీ ఈ కేసు వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి సస్పెన్స్ వీడలేదు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…