Actor Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవికి నటుడు సుమన్ కి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండేది.ఇలా వీరిద్దరూ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే మిగతా సినిమాలేవి విడుదల అయ్యేవి కాదు ఒకానొక సమయంలో సుమన్ సినిమా ముందు చిరంజీవి సినిమా కూడా విడుదలకు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి.ఈ విధంగా కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయిన సుమన్ కెరియర్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది.
ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు రావడంతో ఆయన అరెస్ట్ అవ్వడమే కాకుండా ఈయన గురించి ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. అయితే అందులో సుమన్ తప్పు ఏమాత్రం లేకపోయినా ఆయన గురించి ఎన్నో ఆరోపణలు రావడంతో ఆయన పూర్తిగా తన కెరీర్ ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ఇదంతా ఇండస్ట్రీలో సుమన్ ఎదుగుదలను ఓర్వలేక కొందరు ఉద్దేశపూర్వకంగానే తనని తొక్కేసారని ఇప్పటికి వార్తలు వస్తుంటాయి.
అయితే సుమన్ వ్యక్తిత్వం తెలిసినటువంటి ఎంతో మంది దర్శకులు నిర్మాతలు ఆయన తప్పులేదని తెలుసుకున్నారు ఇక సుమంత్ జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.సుమన్ కు శిరీషతో పెళ్లి జరిగిన తర్వాత ఆయనకు కాస్త కలిసి వచ్చిందని చెప్పాలి ఇక సుమన్ భార్య శిరీష ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత సుమన్ ప్రముఖ రైటర్ డివి నరసరాజు మనవరాలు అయినటువంటి శిరీషని పెళ్లి చేసుకున్నారు. ఇలా శిరీషను పెళ్లి చేసుకోవడంతో ఆయనకు కాస్త కలిసి వచ్చిందని అనంతరం తాను పలు సినిమా అవకాశాలను అందుకుని హీరోగా నటించారు. అనంతరం పలు సినిమాలలో దేవుడి పాత్రలలో కూడా నటించి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సుమన్ మెప్పించారు. అయితే ఈయన కెరియర్ ఇలా పతనం కావడానికి కొందరు హీరోలే కారణమని తెలిసినప్పటికీ ఆ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు సుమన్ వెల్లడించలేదు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…