Featured

Actor Suman: హీరోల రెమ్యూనరేషన్ తగ్గించడం సరికాదు… సినిమా షూటింగుల బంద్ పై సుమన్ షాకింగ్ కామెంట్స్?

Actor Suman: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన సుమన్ తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్స్ తీసుకున్న నిర్ణయం పై స్పందించారు. సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందన్న నేపథ్యంతో నిర్మాతలు అందరూ కలిసి షూటింగ్ బంద్ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై సుమన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ సినిమా సినిమాకు అధికవ్యయం అవుతుందని షూటింగ్ బంద్ చేయడం సరైనది కాదు. అలాగే షూటింగులు బంద్ చేయటం వల్ల ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది. ఇక సెన్సార్ బోర్డు సైతం ఓటీటీ సినిమాలు వెబ్ సిరీస్ లపై దృష్టి సారించాలని ఈయన కామెంట్స్ చేశారు.

ఇకపోతే సినిమాకు అధిక ఖర్చు అవుతుందని హీరోల రెమ్యూనరేషన్ తగ్గించడం సరికాదు అంటూ సుమన్ వ్యాఖ్యానించారు. హీరోలకు క్రేజ్ ఉన్నప్పుడే అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అలా వారి రెమ్యూనరేషన్ తగ్గించడం సరైనది కాదని సుమన్ వెల్లడించారు.హీరోలకున్న రేంజ్ బట్టి నిర్మాతలు డబ్బులు ఇస్తారు. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారు ఇలాంటి నేపథ్యంలో హీరోలకు రెమ్యూనరేషన్ తగ్గించడం భావ్యం కాదని సుమన్ తెలిపారు.

Actor Suman: షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలి…

ఇకపోతే సినిమా అధిక వ్యయంతో తెరకెక్కిస్తున్నప్పుడు నిర్మాతలు షూటింగ్ సమయాన్ని కూడా పెంచుకోవాలని, ఒకప్పుడు పొద్దున 6 గంటలకు షూటింగ్ మొదలవుతే సాయంత్రం 9 వరకు జరిగేది ప్రస్తుతం ఉదయం 9 నుంచి 6 వరకు మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. ఇలా సమయాన్ని పెంచుకోవడం వల్ల నిర్మాతలకు ఖర్చు తగ్గుతుంది అలాగే అనవసరంగా కాల్ షీట్ తీసుకోవడం కూడా నిర్మాతలకు అధిక భారంగా మారుతుందని వీటిని తగ్గించుకుంటే సినిమా తక్కువ బడ్జెట్ కి తెరకెక్కుతుంది అంటూ సుమన్ న్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago