Jr NTR: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతుంది.
ఇకపోతే ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన ఫ్రీ రిలీజ్ వేడుకకు కూడా ముఖ్యఅతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే. సినిమాల పరంగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే తారక్ తన వ్యక్తిగత విషయాలను మాత్రం అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడరు.
అయితే ఎప్పుడైనా తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తే మాత్రం క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.అయితే తాజాగా తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి దిగినటువంటి ఒక రొమాంటిక్ ఫోటోని తారక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఒక బల్లపై ఎన్టీఆర్ ప్రణతి ఎదురెదురుగా కూర్చుని చేతిలో కాఫీ కప్పుతో సరదాగా మాట్లాడుతూ ఉండగా దిగినటువంటి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోని తారక్ షేర్ చేస్తూ ఇలాంటి క్షణాలు అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా ఈ ఫోటో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే కొరటాల శివ సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారు. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని చేయబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…