Naga Chaitanya: సమంత నాగచైతన్య విడిపోయి ఎవరి పనులలో వారు బిజీగా ఉంటున్నారు. అయితే ఇప్పటివరకు విడాకులపై సమంత మాట్లాడిన విషయం మనకు తెలిసిందే కానీ నాగచైతన్యమాత్రం ఎప్పుడు ఎక్కడ తన విడాకుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఇకపోతే ఈయన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన చైతన్యకు ఊహించిన విధంగానే తన విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ నా వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుతుంటే చాలా అసహనం వేస్తోంది అంటూ చిరాకు పడ్డారు.ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది అయితే సమంతతో ఇప్పటికే విడాకుల ప్రకటన చేశామని, దానికి కారణం ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు.
విడాకుల తర్వాత సమంత జీవితం సమంతది. నా జీవితం నాది. ఇక ఈ విషయం గురించి ఇంతకన్నా చెప్పాల్సిందేమీ లేదంటూ చైతన్య ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే చైతన్యకు మరొక ప్రశ్న ఎదురయింది.భవిష్యత్తులో ఎప్పుడైనా సమంతతో కలిసి నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురవుగా ఒక్కసారిగా చైతన్య నవ్వేశారు.గతంలో చైతన్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సమంతతో బాగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ నేను సామ్ భవిష్యత్తులో కలిసి నటిస్తే క్రేజీగా ఉంటుంది.అయితే అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ ప్రపంచానికే తెలియాలి అంటూ సమాధానం చెప్పారు. ఇక సమంత గురించి వస్తున్న రూమర్స్ పై కూడా ఈయన స్పందించారు.మొదట్లో తన గురించి వస్తున్న రూమర్స్ పై ఆలోచించేవాడిని అయితే ప్రస్తుతం అలాంటి రూమర్స్ గురించి పట్టించుకోవడమే మానేశానని ఈ సందర్భంగా మొదటిసారి చైతన్య సమంత గురించి మాట్లాడారు. ప్రస్తుతం చైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…