Featured

Aparna : ఓవర్ నైట్ స్టార్ అయిన ఆ హీరోయిన్ ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా..!

Aparna : కొంతమంది సినిమా తారలు చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులకు గుర్తుండి పోతారు. వాళ్ళు కనిపించిన సినిమాలు ఎన్ని అని కాదు ఎంతకాలం గుర్తున్నారన్నదే పాయింట్. అలాంటి ఒక సీనియర్ నటి అప్పట్లో ఒక్క సినిమాతోనే అందరినీ ఆకట్టుకుని, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుని చివరికి సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం విదేశాల్లో సెటిల్ అయిన ఆ హీరోయిన్ ఇపుడు గుర్తుపట్టలేనంతగా తయారైంది. ఆమె ఎవరో కాదు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుందరకాండ’ సినిమాలో నటించిన అపర్ణ.

పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన అపర్ణ…

అపర్ణ ‘సుందరకాండ’ సినిమాలో లెక్చరర్ ని ప్రేమించే స్టూడెంట్ పాత్రలో నటించింది. సుందరకాండ సినిమాలో స్టూడెంట్ పాత్రకోసం రాఘవేంద్రరావు వెతుకుతున్న సమయంలో ప్రొడ్యూసర్ కేవివి సత్యనారాయణ ఇంట్లో ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి స్టూడెంట్ పాత్రకు బాగుంటుందని అనుకున్నారట. కానీ అడగలేకపోయారు. ఇక సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్న సమయంలో అదే అమ్మాయి ఆడిషన్ లో కనిపించింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఆ అమ్మాయి కేవివి గారి మేనకోడలు అని చెప్పడంతో ఇక అమ్మాయిని స్టూడెంట్ రోజా పాత్రకోసం తీసుకున్నారు. ఆ అమ్మాయే అపర్ణ, సుందరకాండ సినిమాలో రోజా గా తన నటనతో అందరినీ మెప్పించింది. ఎన్నో అవార్డులను సంపాదించుకుంది. ఆ సినిమా తరువాత రోజాకి సినిమాలో హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చినా కొన్ని సినిమాలల్లోనే నటించింది. దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ సినిమలో నటించింది. ఇక ఆ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. శాంతినికేతన్, చంద్ర జ్వలా వంటి సీరియల్స్ లో కనిపించింది అపర్ణ.

ఇక మలయాళం లోనూ, కన్నడ విష్ణువర్ధన్ గారి సినిమాలో కనిపించిన అపర్ణ ఆ తరువాత సినిమాలకు దూరమైంది. పెళ్లయ్యాక సినిమాకు పూర్తిగా దూరమైంది. విదేశాల్లో సెటిల్ అయిన అపర్ణ ప్రస్తుతం అక్కడే స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. చదువును నిర్లక్ష్యం చేయకూడదని తల్లిదండ్రులు చెప్పడం వల్ల అటు చదువు ఇటు నటన, డాన్స్ క్లాసెస్ అన్నింటినీ బాలన్స్ చేస్తూ వచ్చిన అపర్ణ నచ్చినట్టు కొన్ని పాత్రలను మాత్రమే చేసారు. ఇక పెళ్లయ్యాక ఫారిన్ వెళ్లి అక్కడ మళ్ళీ చదువు కొనసాగించారు అక్కడే టీచర్ గా స్థిరపడ్డారు. చదువు, ఇటు నటన రెండు బ్యాలన్స్ చేయడానికి తన తండ్రి చాలా సహాయం చేసారని అపర్ణ చెప్పారు. కమల్ హాసన్, మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమని, ఒక్కసారైనా చిరంజీవి తో కలిసి నటించాలనిఉందని చెప్పారు.

Bhargavi

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

6 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

6 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

6 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

6 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

7 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

7 hours ago