Vadde Naveen: బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇవ్వనున్న నటుడు వడ్డే నవీన్.. ఈ వార్తలలో నిజమెంత?
Vadde Naveen: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ భాషలలో ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం అన్ని భాషల్లోనూ కొన్ని సీజన్లను పూర్తిచేసుకుని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుని. తెలుగులో కూడా 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరో సీజన్ ప్రసారం కావడానికి సిద్దమవుతోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమంలో పలువురు స్టార్ సెలబ్రెటీలు పాల్గొంటున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి వార్తలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పెళ్లి, మనసిచ్చి చూడు, చెప్పాలని ఉంది వంటి సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైన వడ్డే నవీన్ ప్రస్తుతం పలు వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
చాలా కాలంగా వెండి తెరకు దూరమైనా వడ్డే నవీన్ తిరిగి బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలో సందడి చేయనున్నారని తెలియడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈయన కనక ఈ కార్యక్రమంలో పాల్గొంటే బిగ్ బాస్ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. మరి వడ్డే నవీన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…