Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!
Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు ఖడ్గం సినిమాలో ఈ డైలాగు ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి పలు సినిమాలలో నటించిన పృధ్విరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల సమయంలో పృథ్విరాజ్ వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఈయన పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ చైర్మన్ పదవి ఇచ్చారు.ఇలా చైర్మన్ గా కొనసాగుతున్న ఈయన మహిళల పట్ల లైంగిక ఆరోపణలు రావడంతో ఈ పదవి నుంచి తొలగించారు.
ఇక రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన ఈయన ఏకంగా ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీనటుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ విధంగా పృథ్వి రాజ్ పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి వంటి హీరోల పై కూడా ఆరోపణలు చేశారు.
పృథ్వీరాజు నోటిదూల కారణంగా ఈయన చైర్మన్ పదవిని కోల్పోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను కోల్పోయారు.
ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ పొరపాటుగా మాట్లాడానని సినీ పెద్దలకు క్షమాపణలు చెబుతూ తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను వైసిపి అనే ఉగ్రవాద సంస్థలో ఉండి ఒక ఉగ్రవాదిగా మాట్లాడాను అంటూ ఏకంగా పార్టీపై ఆరోపణలు చేయడమే కాకుండా, తన కుటుంబ విషయాల గురించి కూడా తెలిపారు. తన తండ్రి సుబ్బారావు సీనియర్ ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణవతారం సినిమాలో కర్ణుడి పాత్రలో నటించారని, ఆయన సుమారు 17 సినిమాల వరకు నటించారని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…