Featured

Allari shubhasini : క్యాన్సర్ తో నరకం అనుభవించా.. యాంకర్ సుమ వల్లే ఇలా ఉన్నాను.. చిరంజీవిని వేషాలు అడిగితే ఏమన్నారు అంటే.. : నటి అల్లరి సుభాషిని

Allari shubhashini : నాటక రంగం నుండి, సినిమా రంగానికి వచ్చిన ఆర్టిస్టుల్లో సుభాషిణి ఒకరు. చింతామణి నాటకం ద్వారా బాగా ఫేమస్ అయిన సుభాషిణి గారికి చలపతిరావు గారు తన కొడుకు రవిబాబు సినిమాలో అవకాశం గురించి చెప్పారు. ఇక రవిబాబు గారి సినిమా అల్లరి లో మొదట అవకాశం వచ్చి ఆ సినిమాతో అల్లరి సుభాషిణిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత చెన్నకేశవ రెడ్డి, ఈశ్వర్, బెండు అప్పారావు ఆర్ఎమ్పి సినిమా దగ్గర నుండి గుంటూరు టాకీస్ సినిమా వరకు పలు చిత్రాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

క్యాన్సర్ వచ్చిందని చెప్పగానే సుమ ఏం చేసిందంటే…

ఇక పలు సినిమాలలో నటిస్తూ కెరీర్ బాగా ఉన్నపుడే క్యాన్సర్ రావడంతో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాగిణి కి చెప్పగా బాలకృష్ణ గారిని కలిసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారట. ఇక సుభాషిణి గారికి ఎంతో సన్నిహితులైన చలపతిరావు గారు బసవతారకం వద్ద డాక్టర్లకు సిఫార్సు చేయించారట. ఇక ఆ తరువాత నాటక రంగంలో తెలిసిన వ్యక్తి కనిపించి ప్రభుత్వం ద్వారా చికిత్స చేయించుకునే మార్గం చెప్పగా పదిహేను లక్షల దాకా ఖర్చు వస్తుందనుకుంటే ఐదు వేల రూపాయల ఖర్చుతో చికిత్స పూర్తయిందట.

ఇక సినిమా ఇండస్ట్రీ నన్ను అసలు వదల్లేదు, అందరూ సహాయం చేసారు. ఇక మందులు చాలా ఖరీదైనవి కావడంతో యాంకర్ సుమ కి పరిస్థితి చెబితే అమెరికన్ సంస్థ ద్వారా ప్రతి ఆరు నెలలకి ఒకసారి మందులు పంపిస్తారట. ఇక చిరంజీవి గారు ఫోన్ చేస్తే అవకాశాలు కచ్చితంగా నేను ఇప్పిస్తానని, ముందు కోలుకుని నిండు ఆరోగ్యంతో రమ్మని చెప్పారట. ఇక ఇప్పుడిప్పుడే సినిమా అవకాశలు వస్తున్నాయట. ఇక సీరియల్స్ లో కూడా నటించమని అడుగగా అంతసేపు పనిచేయలేనని చెప్పారు. ఇక సుభాషిణి సీరియల్ ను నిర్మించగా అందులో తను సంపాదించిన అన్ని డబ్బులు పెట్టుబడి పెట్టానని సీరియల్ దూరదర్శన్ లో ప్రసారం అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు సహకరిస్తే నా డబ్బులు వస్తాయి, నా కుటుంబం బాగుపడుతుందని ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న మాకు ఆ సీరియల్ విడుదల చాలా ముఖ్యమని చెప్పారు సుభాషిణి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago