టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “అదిపురుష్”. ఈ సినిమా రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ కనిపించగా, సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాలో ఎంతో కీలకమైన రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.
ఇప్పటికీ షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా కరోనా కారణం చేత వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం దర్శకుడు మరొక బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన టార్జాన్ ది వండర్ కార్, సల్మాన్ జైహో వంటి సినిమాల్లో నటించి మంచి ఆదరణ దక్కించుకున్నారు.
తాజాగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు . ‘కొత్త ఆరంభం.. #ఆదిపురుష్’ అంటూ వత్సల్ సేథ్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈ చిత్ర దర్శకుడిని కూడా ఇందులో ట్యాగ్ చేయడంతో నటుడు వత్సల్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ పాత్రలో నటిస్తున్నారనే విషయం గురించి తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…