కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ సినిమాలలో కనిపించే తీరుకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఎంతో చిలిపి పనులు చేస్తూ ఉండే ఈ కేరళ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈమె సినిమాల పరంగా కాస్త వెనుకబడ్డారని చెప్పవచ్చు. సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఈమె కెరియర్లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో సరైన గుర్తింపురాలేదని చెప్పవచ్చు.
ప్రస్తుతం అనుపమ కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజెస్ సినిమాలలో నటిస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ ఒక ఆటకు బాగా బానిసనయ్యానని తెలిపారు. ఇంగ్లీష్ లో పదాలను కనుక్కునే ఆట. ఈ మధ్యకాలంలో ఈ ఆట ట్రెండీగా మారిపోయింది . సెలబ్రిటీలే ఎక్కువగా ఈ ఆట లో మునిగి తేలుతుంటారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అనుపమ ఆడిన ఆటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
గిబ్బరిష్ అనే ఈ ఆటలో భాగంగా కొన్ని వెరైటీ పదాలను ఇస్తారు. మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టవచ్చు. తాజాగా అనుపమ ఈ ఆటలో పూర్తిగా నిమగ్నమవుతూ ఆడారు. ఇక చివరిగా ఇదే అంటూ ఈ పాటను కొనసాగిస్తూ ఆడటంతో అభిమానులు ఎంతో ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె పాడిన పాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ చేసిన అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…