Actor Vijaya Rangaraju : ఆంధ్రప్రదేశ్ కి చెందిన విలన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన విజయ రంగరాజు పలుభాషల్లో నటించినా తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు తోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను మంచి సినిమా అవకాశాలు అందుకున్నారు. అయితే ఆయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల పూణే లో పుట్టి అక్కడే పెరిగారు. అయితే రాయలసీమ లోని గుంతకల్లులో చదువు పూర్తి చేసారు. ఇక నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి ఉండటం వల్ల వాటి మీద ఫోకస్ చేసారు. చెన్నై వెళ్లి దాదాపు 100 నాటకాలు వేసారు. ఇక సినిమాల్లో ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టమంటూ చెప్పే రంగరాజు గారు తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.
రజనీకాంత్ తో చాలా సాన్నిహిత్యం ఉంది…
విజయ రంగరాజు దాదాపు దక్షిణాదిన అన్ని భాషలలోనూ నటించారు. అయితే ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో ఫేమస్ అయ్యారు. తెలుగులో విజయ రంగరాజు కాగా తమిళంలో రాజ్ కుమార్ అని ఇక సౌత్ శెట్టి ఇలా అన్ని పేర్లు ఉండటం వల్ల కొన్ని అవకాశాలు వదులుకున్నాను అంటూ చెప్పారు. ఇక మొదట్లో రజనీకాంత్ గారి సినిమాలో నటించేటపుడు పరిచయం పెరిగి ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత చనువు ఉంది అంటూ చెప్పారు.
ఒకే రాజా అనే సినిమా కోసం పనిచేస్తున్నపుడు తిరుపతి వద్ద షూటింగ్ జరుగుతుండగా శ్రీదేవి, రాధిక హీరోయిన్లు వాళ్ళు ఒకరు సాంబార్, రసం చేయగా రజనీకాంత్ గారు చేపల కూర ఇలా అందరు తలా ఒక వంట చేసే వాళ్లం, సినిమా షూటింగ్ అంతా పిక్నిక్ లాగా ఉండేది అంటూ చెప్పారు. ఇక రజనీకాంత్ గారు ఒక సెలబ్రేషన్ పార్టీ లో నేను డ్రింక్ తీసుకోకపోవడం చూసి ఎద్దులాగా ఉన్నావ్ మందు తాగక పోతే ఎలా అంటూ తాగమన్నారు. అలా మందు తాగడం అలవాటైంది అంటూ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం లడ్డూ నాణ్యత…
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…