Actress Amani : తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సౌందర్య దాదాపు 13 ఏళ్లు నటిగా కొనసాగింది.సినిమా రంగంలో ఎక్స్ పోజింగ్ చేయకుండా రాణించలేరు అనే వాదన ఉంది. కానీ ఈ మాట సౌందర్యకు వర్తించదు.ఆమె తన పరిధిని మించి ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదు. 1990’s లో వచ్చిన హీరోయిన్స్ లలో సౌందర్య, ఆమని మంచి స్నేహితులు.అయితే ఈ మధ్యకాలంలో ఆమని తెలుగులో కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరపై కనిపిస్తున్నారు. ఊర్వశివో రాక్షసివో, అల్లంత దూరాన, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిత్రాలలో ఆమని కీలకపాత్రలను పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా సౌందర్య సోదరుడి చావుకు సంబంధించిన ఓ విషయాన్ని కూడా ఆమని చల్లగా చెప్పారు.అప్పుడు ఏం జరిగిందనేది ఆమని మాటల్లో.. సౌందర్య నేను ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళం ఒకరి పర్సనల్స్ మరొకరు చెప్పుకునే వాళ్ళం.. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే సౌందర్య సోదరుడు అమర్ ని పెళ్లాడవలసి ఉండేది. సౌందర్య తండ్రి సత్యనారాయణ స్వయంగా ఈ విషయం గురించి నన్ను అడిగారు.దానికి నా నుంచి పెద్దగా స్పందన లభించలేదు. నేను ఎక్కువగా వాళ్ళింటికి మోడ్రన్ డ్రెస్సులో వెళ్లే దాన్ని సౌందర్య నాన్నగారు నన్నెప్పుడూ.. ముఖంపై బొట్టు ఏది?! కుక్క నాకేసి వెళ్లిందా? అంటూ ఆటపట్టించేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సౌందర్య వాళ్ళ నాన్న చనిపోయారంటూ నాకు కాల్ వచ్చింది.కానీ నేను అవుట్ డోర్ షూటింగ్ లో ఉండటం మూలంగా వెళ్ళలేకపోయాను.
ఆ తర్వాత బెంగళూర్ లో కలిసినప్పుడు మా కుటుంబంలోని నాలుగు పిల్లర్స్ లో ఒక పిల్లర్ ని కోల్పోయామంటూ.. సౌందర్య వాళ్ళ నాన్న గురించి ఏడ్చింది.. ఆ తర్వాత సౌందర్య కూడా అమర్ ని పెళ్లి చేసుకుంటావా? అని అడిగేది. 2004 జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె సోదరుడు కన్నుమూశారు. అది నేను టీవీలో చూసి తట్టుకోలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే నా మనసు కలత చెందింది. సౌందర్య మరణించిన నెల రోజులకు వెళ్లి వారి అమ్మగారితో గంటసేపు కూర్చొని, మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసాను. కానీ సౌందర్య ఫోటో కి దండ ఉండడాన్ని చూసి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సౌందర్యతో గడిపిన ఆ గత స్మృతులు ఇప్పటికీ గుర్తున్నాయని ఆమని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…