Character artist Sudha : తమిళనాడులో జన్మించినా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు సుధ. ఆమె అసలు పేరు హేమ సుధ. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినా ఆ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించిన సుధ తెలుగులో చాలా మంది హీరోలకు తల్లి పాత్రలో నటించారు. తన కెరీర్ కి సంబంధించిన ఆటుపోట్లతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను కూడా ఆమె తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ సినిమా అప్పుడు ఏడ్చేసా…
తమిళనాడుకి చెందిన సుధ గారు తెలుగులో మొదట్లో నటించే సమయంలో బాగా ఇబ్బంది పడ్డారట. భాష రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘తల్లిదండ్రులు’ సినిమా సమయంలో అందులో ఒక క్యారెక్టర్ కి సుధ ఎంపిక కాగా డైలాగులు తెలుగులో చెప్పడానికి కష్టపడటం వల్ల టేకులు ఎక్కువగా తీసుకున్నారట. దాంతో డైరెక్టర్ సీరియస్ అవ్వడంతో మరో ఆర్టిస్ట్ ను పిలిచి డైలాగులు చెప్పమని చెప్పారట.
అలా చేసే సరికి ఇన్సల్ట్ గా అనిపించింది సుధా గారు ఏడ్చేశారట. అయితే ఆ సినిమా అయ్యే లోపు తెలుగులో ఏదో ఒకటి నేర్చుకుని డైరెక్టర్ టి. రామారావు గారితో మాట్లాడాలి అని డిసైడ్ అయ్యారట. అయితే మరోసారి అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తెలుగు భాష మీద పట్టు పెంచుకున్నారట సుధ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…