Actress Amani: జంబలకడిపంబ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమని మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన అకౌంట్ లో వేసుకుంది. ఇలా ఈ సినిమా హిట్ అవటంతో టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకొని తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమని నటించిన శుభలగ్నం, మావిచిగురు, ప్రియమైన శ్రీవారు, మిస్టర్ పెళ్ళాం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.
ఇలా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తల్లి పాత్రలలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇలా సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆమని మరొకవైపు సీరియల్స్ లో నటిస్తూనే టీవీ షోలలో కూడా పాల్గొంటూ జడ్జిగా సందడి చేస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది.
ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా తీరని కోరికగా నిలిచిపోయిన తన కోరిక గురించి ఆమని బయట పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి కి ఆమని వీరాభిమాని. జంబలకడిపంబ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో నటించిన అవకాశం వస్తుందని ఆమని ఎంతో ఆశగా ఎదురు చూసింది. కాకపోతే ఆమెకు అవకాశం లభించలేదు.
అయితే చాలా కాలం తర్వాత చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా కూడా అనుకోని కారణాలవల్ల ఆ అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత కూడా చిరంజీవి నటించిన సినిమాలో ఏదో ఒక పాత్రలో నటించాలని ఆమని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికీ కూడా చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడం లేదు అంటూ ఆమని తన బాధని బయటపెట్టింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…