Actress Anju: తెలుగు తమిళ కన్నడ భాషలలో బాలనటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అంజు ఒకరు.ఇలా బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె 17 సంవత్సరాల వయసులోనే 50 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి నటుడు ప్రభాకర్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.
ఇలా 17 సంవత్సరాల వయసులో ఏకంగా 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తాను పూర్తిగా మోసపోయానని,నేను తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయంతో నా జీవితమే తలకిందులుగా మారిపోయిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అంజు తెలియజేశారు. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు తన తల్లి ఓ సినిమా 100 రోజుల వేడుకకు తనని తీసుకువెళ్లారని తెలిపారు.
ఆ సమయంలో డైరెక్టర్ మహేంద్ర సర్ తనని చూసి బాలనటిగా అవకాశాలు ఇచ్చారని తెలిపారు.అయితే పెద్దయిన తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పోయింది. అయితే బలవంతంగా తాను ఇండస్ట్రీలో నటిస్తున్న సమయంలోనే హీరో ప్రభాకరన్ తన వద్దకు పెళ్లి ప్రపోజల్ తో వచ్చారు. అయితే తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదని తన తల్లిదండ్రులను అడగాలని చెప్పాను..
ఇక ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు వద్దని చెప్పారు. అయినా తను నా వెంట పడటంతో నేను 17 ఏళ్ల వయసుకే తనతో పాటు వెళ్లిపోయానని తెలిపారు. అయితే పెళ్లి చేసుకొని వెళ్లిన తరువాత అప్పటికే ప్రభాకరన్ కిమూడు పెళ్లిళ్లు జరిగి పిల్లలు కూడా ఉన్నారని తెలిసి ఎంతో బాధపడ్డానని మోసపోయానని గ్రహించి తన నుంచి వేరుగా వచ్చానని తెలిపారు. అయితే అప్పటికే తాను గర్భిణీ అని కూడా అంజు వెల్లడించారు.
ఇలా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో తనతో ఒకటే మాట చెప్పాను.నన్ను చాలా బ్యాడ్ చేశావు… ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇకపై ఈ ఇంటి గడప తొక్కను నువ్వు చచ్చిన నీ మొహం చూడను అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చానని అయితే చాలా రోజులు పాటు డిప్రెషన్ లో ఉన్న తాను ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతున్నానని అంజు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…