Nidhi Aggarwal: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పిన విషయాలు నిజం కావడంతో ఈయన చేసే వ్యాఖ్యలను నమ్మే వారి సంఖ్య రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం ఈయన చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు.
ఇదివరకే నటి రష్మిక మందన్న వేణు స్వామితో తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించడంతో తనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు. అయితే తాజాగా మరొక నటి నిధి అగర్వాల్ సైతం వేణు స్వామి చేత ఇంట్లో రాజా శ్యామల పూజ చేయించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
వేణు స్వామి బృందం సమక్షంలో నిధి అగర్వాల్ ప్రత్యేకంగా పూజలు చేశారు.అయితే ఈమె జాతకంలో ఏదైనా దోషాలు ఉన్న కారణంగా ఇలాంటి పూజలు చేశారా లేకపోతే ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకొని సక్సెస్ సాధించడం కోసం పూజలు చేశారా అనే విషయం తెలియదు కానీ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక నిధి అగర్వాల్ నాగార్జున నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ తదుపరి చిత్రం పూరి జగన్నాథ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటు తెలుగులోను తమిళంలో కూడా సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేకపోవడంతో ఇలా పూజలు చేయించారని పలువురు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…