Krishnavamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో ఫ్యామిలీ కథ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన కృష్ణవంశీ చాలా కాలం తర్వాత రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
మరాఠీ సూపర్ హిట్ చిత్రం నట సామ్రాట్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విజయం పై కృష్ణవంశీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
రంగ మార్తాండ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకుంటుందని తాను ఊహించలేదని తెలిపారు తాను ఇప్పటివరకు తీసిన సినిమాల కన్నా రంగమార్తాండ సినిమాకు మంచి ప్రశంసలు అందాయని ఈయన సంతోషం వ్యక్తం చేశారు.ఈ సినిమా విడుదలకు పెద్దగా ప్రమోషన్ చేయలేదని కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసిందని తెలిపారు.
ఇక ఈ సినిమా టైటిల్ కు ఇది అమ్మానాన్నల కథ అని క్యాప్షన్ ఇవ్వడంతో మరికొంతమందిని ఆకట్టుకుందని తెలిపారు. అయితే ఈ సినిమాకు నాకు నిజ జీవితానికి చాలా తేడా ఉందని తెలిపారు. చిన్నప్పుడే తన తండ్రి చనిపోయారని ప్రస్తుతం తన తల్లి మాత్రమే తన వద్ద ఉన్నారని కృష్ణ వంశీ తెలిపారు. ఇక చిన్నప్పటినుంచి నేను తన పేరెంట్స్ పెద్దగా కనెక్ట్ కాలేదని తెలిపారు.
ఇక తాను డైరెక్టర్ గా మారి ఫ్యామిలీ సినిమాలు చేసినప్పటికీ తను ఒక బ్యాడ్ సన్ అని కృష్ణవంశీ తెలిపారు.ఇక ఇంట్లో వారితో కూడా తాను పెద్దగా క్లోజ్ గా ఉండనంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…