Ramcharan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.
ఇలా రామ్ చరణ్ నటుడుగా మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ గురించి తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్ చేశారు. రామ్ చరణ్ ను ఏకంగా పొట్టోడు అంటూ ఈమె కామెంట్ చేశారు. అయితే ఈమె తనని విమర్శించడానికి ఇలాంటి కామెంట్స్ చేయలేదు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా సమయంలో రామ్ చరణ్ కు జోడిగా హీరోయిన్ అనుష్కను తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట.ఈ విషయం గురించి అనుష్క దగ్గర ప్రస్తావించగా ఆమె రామ్ చరణ్ నా పక్కన పొట్టిగా ఉంటారు పైగా నేను తను అక్కా తమ్ముడి మాదిరిగా ఉంటాము అంటూ చాలా సున్నితంగా ఈ సినిమా అవకాశాన్ని తిరస్కరించారట.
ఇలా రామ్ చరణ్ తన పక్కన పొట్టిగా ఉంటారంటూ అనుష్క చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా రామ్ చరణ్ తన హైట్ గురించి తానే సెటైర్లు వేసుకున్న విషయం మనకు తెలిసిందే.తాను పొట్టిగా ఉండటం వల్ల స్కూల్లో తన ముందు రానా కూర్చొనే వాడని,బోర్డుపై టీచర్ రాసేది కూడా తనకు కనిపించదు అంటూ చరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.ప్రస్తుతం అనుష్క చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…