Featured

Actress Archana Shastri : ఆ హీరో పెట్టిన అలాంటి మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేదని… నన్ను సినిమాలో నుండి తీసేసారు…: నటి అర్చన శాస్త్రి

Actress Archana Shastri : 2004 లో ‘తపన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించింది అర్చన. అదే సంవత్సరం ‘నేను’ సినిమాలోతన నటనతో అందరికీ చేరువ అయ్యింది. మొదట వేద పేరుతో సినిమాలకు పరిచయం అయినా తరువాత కొన్ని రోజులకు అర్చన పేరుతో కెరీర్ ను సాగించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్1లో కంటెస్టెంట్ గా వచ్చి 5వ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం వివాహం చేసుకున్న అర్చన చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మాట్లాడారు.

మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదని సినిమాలో నుండి తీసేసారు…

ఇండస్ట్రీకి ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ అమ్మాయి వీక్నెస్ ను అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు చాలా మందే ఉంటారంటూ అర్చన అభిప్రాయపడ్డారు. తన విషయంలో ప్రతిదీ తల్లిదండ్రులు వెంట ఉండటం వల్ల అలాంటి పరిస్తుతుల నుండి తప్పించుకున్నాను అయితే అదే సమయంలో మరో అమ్మాయి ఇలాంటి ఇష్యూలో ఇరుక్కుంది. కొంతమంది హీరోలు అలా అమ్మాయిలను ట్రాప్ చేయడానికే ఉన్నారు. నాకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురాయ్యాయి అంటూ అర్చన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఒక మలయాళం సినిమా షూటింగ్ అది కూడా నాలుగు రోజులు అయ్యాక హీరో పెడుతున్న మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం లేదని అతను సినిమా నుండి నన్ను తీపించేసాడు. అప్పటి వరకు అతని మాటల నుండి మెల్లగా జారుకుని మేనేజ్ చేసినా చివరకు దొరికిపోయాను. అయితే ఈ విషయంలో నేను ఒంటరి అయ్యుంటే ఇబ్బందులు పడుండేదాన్నేమో కానీ నా తల్లిదండ్రులు ప్రతి విషయంలో నాకు తోడున్నారు. ఆ హీరో పెట్టిన చెత్త మెసేజెస్ విషయంలో కూడా నా తల్లి నాకు ధైర్యం ఇచ్చింది అంటూ వెల్లడించారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago