Featured

Singer Rahul Sipliganj : కోటి గారు నన్ను ఆదరిస్తే… కీరవాణి గారు కొన్నేళ్లుగా నాకు అన్నం పెడుతున్నారు…: సింగర్ రాహుల్ సిప్లిగంజ్

Singer Rahul sipliganj : తెలంగాణ హైదరాబాద్ కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో సొంతంగా ఆల్బమ్స్ చేసి పెడుతూ పేరు తెచ్చుకున్నాడు. అలా మగజాతి, మంగమ్మ, మైసమ్మ వంటి ఆల్బమ్స్ తో ఫేమస్ అయిన రాహుల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమాలో మొదటిసారిగా పాట పాడిన రాహుల్ ఆ తరువాత ‘దమ్ము’ సినిమాలో వాస్తు బాగుందే పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు వచ్చిన పాట ‘రంగస్థలం’ సినిమాలో పడిన ‘రంగ రంగ రంగస్థలాన’ పాట. ఇక ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సింగర్ కాలభైరవ తో కలిసి పాడిన ‘నాటు నాటు’ పాటకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు ఏకంగా మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ గీతానికి తెచ్చిపెట్టింది. కెరీర్ లో మంచి సక్సెస్ చూస్తున్న రాహుల్ సిప్లిగంజ్ తన వ్యక్తిగత జీవితం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

కోటి గారు ఆదరించారు… కానీ నా గాడ్ ఫాదర్ కీరవాణి…

చిన్నప్పటి నుండి సంగీతం మీద మక్కువతో తండ్రి ప్రోత్సాహంతో మ్యూజిక్ వైపు వెళ్లిన రాహుల్ గజల్స్ నేర్చుకుని ఆపైన సంగీతం మీద పట్టు పెంచుకున్నాడు. అలా సింగర్ గా ఎదిగిన తనకు మొదట ఎంకరేజ్ చేసింది కోటి గారే, అయినా అవకాశాలు ఇచ్చి అన్నం పెట్టింది మాత్రం కీరవాణిగారు అంటూ చెప్పారు. ఇండస్ట్రీలో ఆయన నాకు గాడ్ ఫాదర్ అంటూ తెలిపారు. కోటి గారు అవకాశం ఇచ్చారు. మణిశర్మ గారు పని నేర్పించారు.

అయితే కీరవాణి గారి వద్ద పాడటంలో మెలకువలు అలాగే అందరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలు కూడా నేర్చుకున్నాను అందుకే ఆయన నాకు గాడ్ ఫాదర్. అదీ కాక దాదాపుగా కొన్నేళ్లుగా ఆయన కాంపౌండ్ లో పాటలు పాడుతూ డబ్బు కొంత సంపాదించుకోగలిగాను. నేను సెటిల్ అయ్యానంటే అది ఆయన చలవే. అందుకే ఆయన నాకు గాడ్ ఫాదర్ అని చెబుతాను. ఆయన గురించి చెబుతున్నానంటే కోటి గారు, మణి శర్మ గారు తక్కువ అని కాదు ఎవరికి వారే అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago