Keeravani father Shiva Sakthi Datha : ప్రస్తుతం తెలుగు సినిమాను అంతర్జాతీయ వేదిక మీద ఉంచి తెలుగు సినిమా గౌరవాన్ని అలాగే ఇండియన్ సినిమా గౌరవాన్ని నిలబెట్టిన ఘనత డైరెక్టర్ రాజమౌళికి దక్కుతుంది. రాజమౌళి గారి సినిమా అంటే అది ఫ్యామిలీ ప్యాకేజ్. వాళ్ళ ఇంట్లో దాదాపు అందరూ సమిష్టిగా కృషి చేసి సినిమాను తీస్తారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తే కీరవాణి సంగీతం, ఇక కీరవాణి భార్య వల్లి గారు ప్రొడక్షన్ చూసుకుంటే, రమ రాజమౌళి కాస్టుమ్స్ చూసుకుంటారు. ఇక కీరవాణి కొడుకు కాల భైరవ పాటలు పడుతారు. ఇక రాజమౌళి కొడుకు కార్తీక్ కూడా సినిమాలో పనిచేస్తున్నారు. ఇలా మొత్తం కుటుంబం పనిచేస్తూ సక్సెస్ కొడుతున్నారు. ఇక రాజమౌళి కీరవాణిల తండ్రులు ఇద్దరూ సోదరులు, వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబంగా కీరవాణి, రాజమౌళి గారి కుటుంబం ఉంది.
ఆస్తులన్నీ సినిమాల కోసం పోయాయి…
రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు అలాగే కీరవాణి గారి తండ్రి శివ శక్తి దత్త గారు అన్నదమ్ములు. శివ శక్తి దత్త గారికి నలుగురు తమ్ముళ్లు అలాగే ఒక అక్క ఉన్నారు. కర్ణాటకకు వలస వెళ్లిన వారి కుటుంబం అక్కడ 300 ఎకరాల భూమి ఉండేదంటూ శివ శక్తి దత్త గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే తొలి నుండి సినిమాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉండటం వల్ల శివ శక్తి దత్త గారు భూమిని కొంచం కొంచంగా అమ్మి చెన్నైలో సినిమాల్లో పెట్టారట.
ఇక మొత్తం ఆస్తి అమ్మేసి చెన్నై కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారట. ఇక మొదట్లో బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఉమ్మడి కుటుంబంగానే ఉన్న వారి కుటుంబం పూట గడవడానికి కూడా ఇబ్బందులను ఎదుర్కొనేవారట. అయితే శివ శక్తి దత్త గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కీరవాణి గారు ముగ్గురూ సినిమాల్లో సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…