Featured

Actress Ashmita : వాళ్ళు నన్ను దారుణంగా హింసించారు… వాళ్ళని జైల్లో పెట్టేవరకు వదలలేదు…: నటి అస్మిత

Actress Ashmita : ఈటీవీ లో వచ్చిన పద్మవ్యూహం సీరియల్ ద్వారా నటిగా మారిన ఆశ్మిత సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఎక్కువగా సీరియల్స్ తో గుర్తింపు పొందిన అస్మిత మా టీవిలో ప్రసారమయ్యే అగ్నిసాక్షి సీరియల్ ద్వారా విలన్ గా కూడా బాగా నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూత్ కి బ్యూటీ టిప్స్ చెబుతూ మంచి ఫాలోయింగ్ తో ఉన్న అస్మిత కొంత మంది ఆకాతాయిలు వేధించడంతో వారిని సోషల్ మీడియాకు ఈడ్చి అంతవరకు ఏ అమ్మాయి చేయనటువంటి పని చేసి అలా రోడ్డుపై ఏడిపించేవారికి బుద్ధి వచ్చేలా చేసింది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అస్మిత తన కెరీర్ అలాగే తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది.

వాళ్ళు చాలా దారుణంగా వేధించారు…

అస్మిత సీరియల్స్ అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ సుధీర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ రాజస్థాని నటి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొనింది. తాను షూటింగ్ ముగించుకుని తన కారులో వస్తున్న సమయంలో కొంతమంది ఆమె కారును అడ్డగించి నువ్వు అక్కడ యాక్సిడెంట్ చేసావ్ వాళ్ళను హాస్పిటల్ లో జాయిన్ చేసి వస్తున్నాం డబ్బులు ఇవ్వు అంటూ వేధించారట.

కారులో ఉన్నది అస్మిత అని గుర్తుపట్టి అసిస్టెంట్ ను ఇక్కడే పెట్టుకుంటాం వెళ్లి డబ్బు తీసుకురా అంటూ వేధించడంతో పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చాక అక్కడి నుండి వెళ్లాల్సి వచ్చింది అంటూ తెలిపింది. ఇక మరోసారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారులో ఉండగా కొంత మంది ఆకతాయిలు కారులోకి తొంగి చూడటం ఇబ్బందికరంగా బిహేవ్ చేయడంతో వారి ఫోటోలను తీసి బైక్ నెంబర్ తీసి ఫేస్ బుక్ లో పెట్టడంతో వారిని షీ టీం వారు అరెస్ట్ చేసారు. ఈ సంఘటన బాగా వైరల్ అవడం వల్ల అప్పటి నుండి అమ్మయిలు ఇలా ఎవరైనా ఇబ్బంది పెడితే ఫోన్ తీసుకుని ఫోటో తీయడానికి పోగానే అలాంటి వాళ్ళు భయపడుతున్నారు అంటూ అస్మిత అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

8 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

9 hours ago