Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయనకు ఇంత మంచి పేరు రావడానికి గల కారణం నటన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి తాను నటించే పాత్రలకు వంద శాతం న్యాయం చేయడమే కారణమని చెప్పాలి.
ఈయన ఏ సినిమాలో అయినా ఒక పాత్రకు కమిట్ అయ్యారు అంటే పూర్తిగా ఆపాత్రకు న్యాయం చేస్తారు. సినిమాల కోసం తనని తాను పూర్తిగా మార్చుకుంటారనే సంగతి ఇప్పటికే నిరూపితమైంది. పుష్ప సినిమాలో ఈయన నటించిన తీరు అందుకు నిదర్శనం అని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించడం ఏకంగా చికెన్ కూడా మానేసారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఈయన చికెన్ అసలు ముట్టుకోలేదని చికెన్ తన దరిదాపులలోకి కూడా రానివ్వలేదంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఏ సినిమా కోసం చికెన్ తినడం మానేశారు అనే విషయానికి వస్తే…
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి కుర్రాడు పాత్రలో నటిస్తారు.ఇక బ్రాహ్మణులు చికెన్ తినరు కనుక వారిని గౌరవిస్తూ ఈ పాత్రలో నటించినన్ని రోజులు అల్లు అర్జున్ కూడా చికెన్ ముట్టుకోకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ విధంగా అల్లు అర్జున్ సినిమా కోసం చికెన్ మానేసారని తెలియడంతో నటన పట్ల ఈయనకు ఉన్నటువంటి డెడికేషన్ ఏంటో అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…