Featured

Kota Srinivas Rao: రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నామని బహిరంగంగా చెబుతున్నారు… స్టార్ హీరోలపై ఫైర్ అయిన కోట?

Kota Srinivas Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం వయసు పై పడటంతో సినిమాలకు దూరంగా ఉంటూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే పలు యూట్యూబ్ ఛానల్ లకు ఈయన ఇంటర్వ్యూలు సినిమా సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాలని ఎప్పుడూ ఎక్కడ బయట పెట్టలేదని తెలిపారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు రోజుకు మేము రెండు కోట్లు తీసుకుంటున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అయినా ప్రస్తుత కాలంలో సినిమా ఎక్కడ ఉంది సినిమా మొత్తం సర్కస్ చేస్తూనే ఉన్నారు. చివరికి విషాద గీతాలకు కూడా డాన్సులు చేస్తున్నారని ఈయన తప్పు పట్టారు. ఇక స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ల గురించి కూడా ఈ సందర్భంగా కోట మాట్లాడారు.

Kota Srinivas Rao: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారా…


స్టార్ హీరోలు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారని తెలిపారు. బాత్రూం బ్రష్ దగ్గర నుంచి మొదలుకొని బంగారు నగల వరకు ప్రతి ఒక్కటినీ ప్రచారం చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారని ఇలా స్టార్ హీరోలు అందరూ ఇలా సంపాదించడంతో మిగిలిన వారికి ఎలా సంపాదన వస్తుంది అంటూ మండిపడ్డారు. అయితే కోట శ్రీనివాసరావు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఈయనపై మండిపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago