Featured

Actress Ashmitha : వాళ్ళు నన్ను దారుణంగా హింసించారు…. ఎవరు అంతవరకు చేయని పని చేశాను…: నటి అస్మిత

Actress Ashmitha : ఈటీవీ లో వచ్చిన పద్మవ్యూహం సీరియల్ ద్వారా నటిగా మారిన ఆశ్మిత సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోను కనిపించింది. అయితే ఎక్కువగా సీరియల్స్ తో గుర్తింపు పొందిన అస్మిత మా టీవిలో ప్రసారమయ్యే అగ్నిసాక్షి సీరియల్ ద్వారా విలన్ గా కూడా బాగా నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూత్ కి బ్యూటీ టిప్స్ చెబుతూ మంచి ఫాలోయింగ్ తో ఉన్నా అస్మిత కొంత మంది ఆకాతాయిలు వేదించడంతో వారిని సోషల్ మీడియా కు ఈడ్చి అంతవరకు ఏ అమ్మాయి చేయనటువంటి పని చేసి అలా రోడ్డుపై ఏడిపించేవారికి బుద్ధి వచ్చేలా చేసింది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న అస్మిత తన కెరీర్ అలాగే తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది.

వాళ్ళు చాలా దారుణంగా వేధించారు….

అస్మిత సీరియల్స్ అలాగే పలు సినిమాల్లోను నటించింది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ సుధీర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ రాజస్థాని నటి తనకు ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొనింది. తాను షూటింగ్ ముగించుకుని తన కారులో వస్తున్న సమయంలో కొంతమంది ఆమె కారును అడ్డగించి నువ్వు అక్కడ యాక్సిడెంట్ చేసావ్ వాళ్ళను హాస్పిటల్ లో జాయిన్ చేసి వస్తున్నాం డబ్బులు ఇవ్వు అంటూ వేదించారట.

కారులో ఉన్నది అస్మిత అని గుర్తుపట్టి నీ అసిస్టెంట్ ను ఇక్కడే పెట్టుకుంటాం వెళ్లి డబ్బు తీసుకురా అంటూ వేదించడంతో పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చాక అక్కడి నుండి వెళ్లాల్సి వచ్చింది అని తెలిపింది. ఇక మరో సారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారులో ఉండగా కొంత మంది ఆకాతాయిలు కారులోకి తొంగి చూడటం ఇబ్బందికరంగా బిహేవ్ చేయడం తో వారి ఫోటోలను తీసి బైక్ నెంబర్ తీసి పేస్ బుక్ లో పెట్టడం తో వారిని షీ టీం వారు అరెస్ట్ చేసారు. ఈ సంఘటన బాగా వైరల్ అవడం వల్ల అప్పటి నుండి అమ్మయిలు ఇలా ఎవరైన ఇబ్బంది పెడితే ఫోన్ తీసుకుని ఫోటో తీయడానికి పోగానే అలాంటి వాళ్ళు భయపడుతున్నారు అంటూ అస్మిత అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

49 minutes ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

55 minutes ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

1 hour ago

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…

6 hours ago

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

6 hours ago

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…

7 hours ago