Actress Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఒపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.
నాకు బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయి…
బిగ్ బాస్ సమయంలో జరిగింది నేను పోరాడింది వెరైతే మీడియాలో నేను క్యాస్టింగ్ కౌచ్ కోసం పోరాడినట్లు మార్చేశారు. నిజానికి నేను వర్క్ ఎత్తిక్స్ కోసం పోరాడను. వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చే ముందు కొన్ని రోజులు ఎవరికీ చెప్పకూడదు. ఎక్కడ కనిపించకూడదు ప్రాజెక్ట్స్ చేయకూడదు అని చెప్పినపుడు దానికి వాళ్ళ నుండి డబ్బు రావాలి అని డిమాండ్ చేసాను. వాళ్ళు చెప్పారని అన్ని రోజులు ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఉంటే చివరి నిమిషంలో బిగ్ బాస్ లో మీరు లేరని చెప్పారు. అలాంటప్పుడు ఆ పదిహేను రోజులకు డబ్బు ఇవ్వాలి అదే నేను ప్రశ్నించాను.
అలాగే నాతో సంతకం చేయించుకున్న బాండ్ పేపర్ ఒక కాపీ అడిగితే ఇవ్వలేదు ఇక ఈ ఇష్యూ మీద కోర్ట్ కి వెళ్ళాను. నా వెనుక ఉంటామని సపోర్ట్ చేస్తాని చెప్పినవాళ్లు మధ్యలోనే పారిపోయారు. ఇక ఆపైన ఆ కేసు డైల్యూట్ అయిపోయింది. ఇక నా హెల్త్ బాగోలేక నేను పట్టించుకోలేదు అంటూ గాయత్రి తెలిపారు. బిగ్ బాస్ లో అందరూ పెద్దవాళ్లు ఉండటం వల్ల బెదిరింపు కాల్స్ చాలా వచ్చేవి. చంపేస్తామని రేప్ చేయిస్తామని మీడియా ముందుకు వెళ్లి సారీ చెప్పాలంటూ బాగా బెదిరించారు అవన్నీటికి సంబంధించిన రికార్డింగ్స్ ఇప్ప్పటికి నా దగ్గర ఉన్నాయ్ అంటూ గాయత్రీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…