సినిమాలో అవకాశాలు రావాలంటే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా చెప్పాలంటే హీరోయిన్ల గురించి. వాళ్లకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దొరకాలంటే.. దర్శక నిర్మాతలు చెప్పిన మాట వినాల్సిందే. లేకపోతే వారికి ఇండస్ట్రీలో మనుగడ ఉండదు. ఈ విధమైన బాధలు కేవలం వాళ్లు మాత్రమే కాదు.. సినిమాల్లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఉంటాయి. వాళ్లకు కూడా ఎన్నో చెప్పుకోరాని సంఘటనలు ఎదురై ఉంటాయి.
క్యారెక్టర్ ఆర్టిస్టు చేయాలన్నా దర్శక నిర్మాతాలు ఏవేవో వారి నుంచి ఆశిస్తూనే ఉంటారనీ గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి పవిత్రా లోకేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె సినిమాలో అమ్మగా, వదినగా పలు పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను అనుభవించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఆమె కన్నడంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి హీరోయిన్ పాత్రలో నటించారు.
అయితే తనసినీ కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, తనకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు తన నుంచి కూడా ఏదో ఆశించేవారని ఎన్నో సందర్భాలలో పవిత్రా లోకేష్ తెలియజేశారు. విచిత్రం ఏంటంటే.. సినిమాలో తనకు అవకాశం ఇద్దామని వచ్చేవారిని చూసి ఆమె ఎంతగానో భయపడ్డట్లు ఆమె ఇంటర్వ్యూ లో చెప్పారు. దీనిని బట్టి చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎన్ని కష్టాలను అనుభవించారో అని.
సినిమాలో అవకాశాలు రావాలని చాలామంది కోరుకుంటారు.. కానీ మంచి అవకాశాలు రావాలంటే మనం కూడా వారికి అవకాశాలు ఇవ్వాల్సిందేనని నటి పవిత్రా చెప్పుకొచ్చారు. ఒక హీరో తనని వాడుకొని వదిలేశారని.. ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఆ పూర్తి వివరాలను మాత్రం ఆమె చెప్పలేదు. అయితే ఆ నటుడు తమిళంలో స్టార్ హీరో అని.. ప్రస్తుతం కమెడియన్ గా చేస్తున్నారనే క్లూ మాత్రం ఆమె ఇచ్చింది. ఇలా ఆమె సినిమాలోకి వచ్చే ముందు జరిగిన ఘటన గురించి చెప్పారు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…