Actress Gracy Singh: ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు రావడంతో పాత హీరోయిన్లు కనుమరుగవ్వడం సర్వసాధారణం అయితే కొందరు సీనియర్ హీరోయిన్ తిరిగి తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కానీ మరి కొంతమంది హీరోయిన్లు నటించిన ఒకటి రెండు సినిమాలలో ఆయన ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండి పోతారు. అలాంటి వారిలో నాగార్జున నటించిన సంతోషం సినిమా హీరోయిన్ ఒకరు.
నాగార్జున నటించిన ఈ సినిమాలో శ్రియ కీలక పాత్రలో నటించారు. అయితే మరొక హీరోయిన్ పాత్రలో నటి గ్రేసీ సింగ్ నటించారు. ఇలా ఈ సినిమాలో గ్రేసీ సింగ్ పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని దేవుడే దిగివచ్చిన అనే పాట ద్వారా ఈమె ఎంతో ఫేమస్ అయ్యారు.ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె వరస సినిమాలలో నటిస్తుందని అందరూ భావించారు కానీ ఈమె మోహన్ బాబు శ్రీకాంత్ నటించిన తప్పుచేసి పప్పుకూడు సినిమాలో నటించారు.
అయితే ఈమెకు ఇతర భాషలలో సినిమా అవకాశాలు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఇలా తెలుగు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె 2015 వ సంవత్సరంలో ఓ పంజాబీ సినిమాల్లో నటించి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి గ్రేసీ సింగ్ ప్రస్తుతం 42 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
స్వతహగా భరతనాట్యం డాన్సర్ అయినటువంటి గ్రేసీ సింగ్ గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్’ని ప్రారంభించిందట. దేశ, విదేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తోందట. అలాగే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ఈమె ఏదైనా పండుగలు పర్వదినాల సమయంలో మాత్రం తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…