Shanoor Sana begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన బేగం. మోడల్ గా అడుగుపెట్టిన ఆమె ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాలో బెనర్జీ వైఫ్ క్యారెక్టర్ చేసి తెలుగులో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక చక్రవాకం సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన సన అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన లైఫ్ ని వ్లాగ్స్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ అన్ని విశేషాలను పంచుకున్నారు.
అమ్మవారిగా చేసినపుడు…
సన గారు ఎన్నో పాత్రలు చేసినా అందులో బాలకృష్ణ గారి సినిమాలో నటించిన అమ్మవారి పాత్ర అలాగే శ్రీరామ రాజ్యం సినిమాలో కైకేయిగా నటించి మెప్పించారు. అయితే ఒక ముస్లిం అయ్యుండి అమ్మవారి పాత్రలో నటించినపుడు ఎలా అనిపించింది అనే ప్రశ్న ఎదురైనపుడు ఆ అమ్మవారే తన పాత్ర నేను వేయాలి అనుకుంది అందుకే ఆ పాత్ర అంత బాగా వచ్చింది. నాకు ఏ రోజూ కుల మాతాల పట్టింపులు లేవు.
మా ఇంట్లో కూడా అందరూ మతం గురించి పెద్దగా ఆలోచించారు. నా తండ్రి క్రిస్టియన్, తల్లి ముస్లిం కానీ నేను ముస్లిం లాగా పెరిగాను. ఇక నా పిల్లలు నా భర్త ఏనాడూ ముస్లిం అని చెప్పరు. ఇండియన్ ముస్లిమ్ అనే చెబుతాం. నాకు మతం అంటూ మాట్లాడటం రాదు, అందరం ఒకటే అనే భావన నాలో ఉంది అంటూ సన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్…
తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…