Actress Hansika: తెలుగు చిత్ర పరిశ్రమకు దేశముదురు సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి హన్సిక.అల్లు అర్జున్ హన్సిక హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో పలు సినిమాలలో అవకాశాలను అందుకున్నారు.
ఈ విధంగా వరుస తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ బిజీ అయ్యారు.తమిళంలో అగ్ర హీరోలు అందరి సరసన అవకాశాల అందుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన హన్సిక అనంతరం తెలుగు సినిమాలకు దూరమయ్యారు. ఇలా వెండితెరపై నటిగా సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె త్వరలోనే పెళ్లి పీటలు లెక్కపోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి డిసెంబర్ మొదటి వారంలో జరగనుందని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మరెవరో కాదని తన కంపెనీ పార్టనర్ సోహైల్ కతురియానే ఆమె పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే హన్సిక వివాహాన్ని ఎంతో ఘనంగా చేయాలని భావించిన కుటుంబ సభ్యులు జైపూర్ లోని ముండోటా ప్యాలెస్ బుక్ చేశారని ఈ ప్యాలెస్ లో వివాహ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. మరి హన్సిక పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలోఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక హన్సిక చేసుకోబోయే వ్యక్తి ఇతనే అనే విషయంలో క్లారిటీ రావాలంటే డిసెంబర్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…