Featured

Bahubhali Vinay : రాజమౌళి వల్ల ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడా… నేను ప్రత్యేక్షంగా చూసా ఆయన ఎలాంటివాడంటే : బాహుబలి వినయ్

Bahubhali Vinay : దాదాపుగా రాజమౌళి గారి అన్ని సినిమాల్లో నటించిన ఆర్టిస్ట్ బాహుబలి వినయ్. కానీ మొదటి సారి బాహుబలి సినిమా తరువాత ఆ సినిమానే ఇంటి పేరు గా పేరు ముందు చేర్చుకున్నాడు. దాదాపు గా యాభై అరవై సీనిమాల్లో నటించిన వినయ జక్కన పనితీరు గురించి సెట్స్ లో ఎలా ఉంటారు అనే విషయాలతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ తగ్గించారు అనే ఇష్యూ మీద మాట్లాడారు.

రాజమౌళి సెట్స్ లో అలా ఉంటారు…

జక్కన్న సినిమా షూటింగులో స్ట్రిక్ట్ గా రూల్స్ ఉంటాయంటూ చెప్పారు. బయట సెక్యూరిటీ వద్దే ఫోన్ తీసుకుంటారని ఒకవేళ ఎవరి దగ్గరైనా ఫోన్ కనిపిస్తే అది పగిలిపోతుందని చెప్పారు. పెద్ద హీరో అయినా జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఇలాగే రూల్స్ ఉంటాయంటూ చెప్పారు. ఇక సెట్స్ లో హీరోతో ఎలా ఉంటారో జక్కన ఒక సాధారణ ఆర్టిస్ట్ తో కుడా అలానే ఉంటారు అంటూ కొంచెం కుడా ఆయన ఇమేజ్ కి ఇగో ఉండదంటూ చెప్పారు. ఇక సినిమా తీసాక ఆయన టెన్షన్ పడడంటూ చెప్పారు, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తనకు తెలుసనీ అందుకే ఆయనకు టెన్షన్ ఉండందని చెప్పారు. ఇక ఆయన ప్రతి సినిమాలో ఉండే వినయ్ పాత్రల గురించి డిస్కషన్ వచ్చినపుడే ఈ పాత్రలో వినయ్ అని కొన్ని సినిమాలకు రాజమౌళి గారే చెప్పిన సందర్భాలు ఉన్నాయంటూ అయితే బయట వేరే డైరెక్టర్లకు రికమెండ్ చేయడాలు వంటివి చేయరని కానీ ఆయనకు పని నచ్చితే మళ్ళీ వారికి అవకాశం ఇస్తారంటూ చెప్పారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో పాత్ర తగ్గిందని ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడంటూ వచ్చిన వార్తలపై మాట్లాడుతూ సినిమా కథ విన్నప్పుడే అన్ని చర్చలు జరిగాయి. జనాల్లోకి వెళ్ళాక ఎలాంటి చర్చ వస్తుందో కూడా ముందే అంచనా వేసుకుంటారు. సినిమాను ఒక హీరో అభిమానిగా కాకుండా సినిమాను సినిమా గా తీస్తే సినిమా లో పాత్రలు అర్థమవుతాయి అంటూ చెప్పారు. అయిన ఎన్టీఆర్ పాత్ర తక్కువుంటుంది చరణ్ కి ఎక్కువ ఉంటుంది అని జక్కన చెప్పినా ఎన్టీఆర్ హర్ట్ అవ్వడం లాంటివి జరగవు, సరే పర్లేదు చరణ్ కే ఎక్కువ క్యారెక్టర్ పెట్టు అనేంత స్నేహం వాళ్ళది అంటూ వినయ్ చెప్పారు. మళ్ళీ ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా చేస్తారు అంటూ చెప్పాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago