Actress Sarita: దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పలు భాషలలో ఎన్నో సినిమాలలో అగ్ర హీరోలు అందరు సరసన నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి సరిత గురించి పరిచయం అవసరం లేదు.దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆగ్ర హీరోలు అందరి తరపున నటించిన ఈమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు.
ఇలా ఇండస్ట్రీలో ఏమాత్రం తీరిక లేకుండా సినిమాలలో నటించి గుర్తింపు పొందిన సరిత రాధికతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సీరియల్ లో కూడా సందడి చేశారు.ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే వెంకటసుబ్బయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే తనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో తన భర్తకు విడాకులు ఇచ్చి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో ప్రముఖ కెమెరామెన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నవకాంత్ అనే వ్యక్తితో కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగిపోయింది.అయితే ఈసారి విధి ఈమె పట్ల చిన్నచూపు చూసింది నవకాంత్ ప్రమాదవశాత్తు మరణించడంతో సరిత గుండె ముక్కలైంది.
కొన్ని రోజులపాటు నవకాంత్ జ్ఞాపకాలలో చిత్రపరిశ్రమకు దూరమైన ఈమె అనంతరం ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. అనంతరం తన తోటి నటుడు ముఖేష్ తో పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు.అయితే కొన్ని కారణాలవల్ల ఆయన కూడా మోసం చేసి ఇతర హీరోయిన్ తో చనువుగా ఉంటూ ఈమెకు విడాకుల నోటీసులు నోటీసులు పంపించారు.అయితే విడాకులకు సరిత బదులు ఇవ్వలేదన్న ఒక కారణంతోనే ఈయన తనకు విడాకులు ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసి ఈమె కోర్టులో ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇలా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సరిత ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులతో కలిసి దుబాయ్ లో నివసిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…