Himaja: బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించిన హిమజ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ఈ కార్యక్రమం అనంతరం ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని పలు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. అదే విధంగా ఈమె సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు.
ఇకపోతే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హిమజ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇదివరకే ఈమె తన హోమ్ టూర్ చేసిన విషయం మనకు తెలిసిందే.హైదరాబాదులో ఉన్న హోమ్ టూర్ మాత్రమే కాకుండా తన సొంతూరులో ఉన్న హోం టూర్ కూడా చేసి చూపించారు.ఇకపోతే హిమజ తన డ్రీమ్ హౌస్ కూడా నిర్మించుకుంటున్న విషయం మనకు తెలిసిందే త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి కాబోతుందని కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతామని వెల్లడించారు.
ఇకపోతే తాజాగా ఈమె మరొక హోమ్ టూర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇంటిని రీ మోడలింగ్ చేసి అమ్మాలని ప్రయత్నంలో ఉండడంతో వీరు రేంటెడ్ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే వీరు అద్దెకు ఉన్న ఆ ఇంటిని హోమ్ టూర్ చేసి ఆ వీడియోని పంచుకున్నారు. ఇక ఈ ఇంటిలో ఈమె తన బెడ్ రూమ్ కిచెన్ డైనింగ్ లివింగ్ ఏరియా అని చూపించారు.
ఇంట్లో ఎక్కువగా ఓనర్ వాళ్ళు ఇచ్చిన ఫర్నిచర్ ని ఉపయోగిస్తున్నామని తమ ఇంటికి సంబంధించిన వస్తువులు చాలా తక్కువగా ఉపయోగించామని త్వరలోనే కొత్త ఇంటికి షిఫ్ట్ కావడం వల్ల అన్ని స్టోర్ రూమ్ లో భద్రపరిచామని వెల్లడించారు. ఇక ఈ హోమ్ టూర్ లో ఉన్న హౌస్ ఫోర్ బెడ్ రూమ్ హౌస్ అని హిమజ ఈ సందర్భంగా వారు అద్దెకు ఉంటున్న ఇంటిని హోమ్ టూర్ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…