Movie News

Samantha: మరోసారి ఊ అంటావా అంటూ రేచ్చిపోయిన సమంత.. అంత ఓవరాక్షన్ అవసరం లేదంటున్న నేటిజన్స్?

Samantha: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటలో సమంత నటించడం మరో విశేషం. పుష్ప సినిమాలో ఊ అంటావా మావ అనే మాస్ సాంగ్ కు సమంత మాస్ స్టెప్పులతో ఇరగదీసింది అని చెప్పాలి. ఇలా ఈ పాటతో పాన్ ఇండియా స్థాయిలో ఓ ఊపు ఊపిన సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరోసారి ఊ అంటావా అంటూ రెచ్చిపోయింది.అయితే ఈసారి ఏకంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఈమె కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు.ప్రస్తుతం ఈ టాక్ షో ఏడవ సీజన్ ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సమంత అక్షయ్ కుమార్ ఇద్దరు ఈ పాటకు డాన్స్ వేయడమే కాకుండా అక్షయ్ కుమార్ ఏకంగా సమంతని ఎత్తుకొని ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి పర్ఫామెన్స్ అదిరిపోయింది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు అంత ఓవరాక్షన్ అవసరం లేదు మరి ఎత్తుకొని తీసుకురావాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విడాకులపై స్పందించాల్సిన సమయం వచ్చిందా…

మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది అయితే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం కానుంది. మరి ఈ టాక్ షోలో కరణ్ సమంతను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఈమె తన విడాకులు గురించి నోరు విప్పాల్సిన సమయం వచ్చిందా?ఒకవేళ అలాంటి ప్రశ్నలు అడిగితే సమంత ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పిందనే విషయం గురించి పెద్ద ఎత్తున అభిమానులలో ఆత్రత నెలకొంది. మరి ఈ టాక్ షోలో సమంతకు ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయనే విషయం తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago