Categories: FeaturedMovie News

Actress Jamuna: వెండితెర సత్యభామ… సీనియర్ నటి జమున కన్నుమూత!

Actress Jamuna: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సీనియర్ నటి జమున ఇకలేరు. ఈమె నేడు ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించారు. జమున మరణ వార్త తెలియగానే సినీ సెలెబ్రెటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున 1936 ఆగస్టు 30వ తేదీన హంపిలో జన్మించారు. ఈమె 1953 వ సంవత్సరంలో పుట్టిల్లు అనే సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈమెకు మిస్సమ్మ సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మూగమనసులు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు

ఏఎన్ఆర్ సావిత్రి నటించిన మూగమనసులు సినిమాలో ఈమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ జగ్గయ్య వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈమె తెలుగులో సుమారు 150 కి పైగా సినిమాలలో నటించారు.

Actress Jamuna: రేపు జమున అంత్యక్రియలు…

ఇలా తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో నటించి మెప్పించిన జమున నేడు అనారోగ్య సమస్యలతో వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆఖరి శ్వాస వదిలారు.ఇక ఈమె పార్తివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం నేడు ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు రేపు ఉదయం ఈమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈమె మరెన్నో వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago