Categories: FeaturedMovie News

Actress Jayakumari : ఆర్థిక పరిస్థితి బాగోలేక సహాయం కోసం ఎదురు చూపులు… కలచివేస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్ కష్టాలు..!

Actress Jayakumari : ఒకప్పుడు తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 400 కు పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగారు జయకుమారి. ‘నాడోడి’ అనే తమిళ్ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. తెలుగులో బాలమిత్రులకథ, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, కళ్యాణ మండపం, ఇంటి గౌరవం వంటి సినిమాలలో నటించి అభిమానుల మనసులో నిలిచిపోయారు. వందల సినిమాలలో నటించినప్పటికీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేక దీన స్థితిలో ఉన్నారు.

కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో డబ్బులు లేక ప్రభుత్వాసుపత్రిలో…

జయకుమారి కెరీర్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు. జయకుమారి భర్త ఇటీవల మరణించడంతో ఆర్ధికంగా చాలా దయనీయ స్థితిలో ఉన్నారని సినీవర్గాల సమాచారం. ఇక ఇప్పుడు జయకుమారి ఆరోగ్యం కూడా బాలేదు, ఆమె రెండు కిడ్నీలు పాడైపోయినట్టు వైద్యులు తెలిపారట.

ఇక ఈమె పిల్లల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేనట, వాళ్ళు ఇద్దరూ కూడా అద్దె ఇళ్లలో ఉండి జీవనం సాగిస్తున్నారట. పిల్లల పరిస్థితి తెలుసు కాబట్టి వైద్యం నిమిత్తం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారట. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలా ఉండటంతో అందరూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆమె ఎక్కువగా సినిమాలు చేసిన తెలుగు, మలయాళం, తమిళ్ సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago