Movie News

Actress Jayaprada: కృష్ణం రాజుగారు ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు.. ఆ పిలుపు మర్చిపోలేను: జయప్రద

Actress Jayaprada: టాలీవుడ్ సీనియర్ నటి బీజేపీ నాయకురాలు జయప్రద గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె ఇతర భాషలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. అయితే టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో నటి జయప్రద ఆయన మరణం పై స్పందిస్తూ కన్నీరు మున్నీరయ్యారు.

కృష్ణంరాజు పార్తివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఈమె మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.కృష్ణం రాజుగారు తన జీవితంలో సినీ నటుడిగా రాజకీయవేత్తగా కేంద్రమంత్రిగా ఎన్నో బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఎలాంటి మచ్చ లేకుండా రారాజుగా మరణించారు. ఇలా ఈయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.

కృష్ణంరాజు గారు ఎప్పుడు ఎక్కడ కనిపించినా జయప్రద ఎలా ఉన్నావమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన పిలిచే ఆ పిలుపు ఇప్పటికీ నా చెవులలో మారుమోగుతోంది. ఇలాంటి మంచి మనిషి మన మధ్యన లేరంటే నమ్మశక్యంగా లేదని ఈమె తెలియజేశారు.ఇక ఆయన నటించిన పలు సినిమాలలో నటించే అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు అదృష్టవంతురాలని అంటూ ఈమె కృష్ణంరాజు గురించి ఎమోషనల్ అయ్యారు.

Actress Jayaprada: మచ్చలేని మా రాజుగా బతికారు..

ఇక కృష్ణంరాజు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ ఆయన పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు చిన్న పిల్లలు వారికి, తన భార్య శ్యామలాదేవికి భగవంతుడు ఈ బాధ నుంచి బయటపడేందుకు ఎంతో శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా జయప్రద కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తులసి మాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి?

హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…

2 hours ago

గూగుల్ AI హబ్ తర్వాత సింహాచలం దర్శనం… సీఎం, కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…

2 hours ago

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

2 hours ago

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…

2 hours ago

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…

2 hours ago

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

2 hours ago