Ileana: గోవా బ్యూటీ ఇలియానా దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పోకిరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించి ఇండస్ట్రీలో ఊహించని విధంగా అగ్రతారగా ఓ వెలుగు వెలిగిపోయారు.ఇలా తెలుగు తమిళ భాషలలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి ఇలియానా కొంతకాలం తర్వాత వరుస ప్లాప్ సినిమాలలో నటిస్తూ పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.
ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేక అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ చేసే హాట్ ఫోటోషూట్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నారు.
ఇకపోతే గతంలో ఇలియానా ఒక విదేశీ వ్యక్తితో ప్రేమలో పడి తన లవ్ బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇలియానా గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి సోదరుడితో డేటింగ్ లో ఉందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మరెవరో కాదని బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నారని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పెళ్లి షాపింగ్ చేస్తుండడంతో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మరింత బలం చేకూరింది. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…