Actress Laila: చూడగానే ఎంతో అమాయకత్వపు ముఖంతో చిలిపి చూపులతో,అందమైన చిరునవ్వుతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి సొట్టబుగ్గల చిన్నది లైలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దుష్మన్ దునియా కాఅనే హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం తెలుగులో ఎగిరే పావురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇలా మొదటి సినిమాతోనే తన అల్లరి చేష్టలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించి సందడి చేశారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లైలా అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు.
8 సంవత్సరాల పాటు తన ప్రియుడుతో డేటింగ్ లో ఉన్నటువంటి లయ 2006వ సంవత్సరంలో బిజినెస్ మెన్ మెహ్దీని మ్యారేజ్ చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు సంతానం కలరు.ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి లయ పలు టీవీ షో లలో సందడి చేస్తూ కనిపించారు. అయితే తాజాగా ఈమె హీరో కార్తీ నటించిన సర్దార్ సినిమా ద్వారా ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇలా ఈ సినిమాతో మరోసారి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా తనకు మంచి కథ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు కనుక వస్తే తప్పకుండా తెలుగు సినిమాలలో కూడా నటిస్తానని వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే లైలా ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…