Featured

Bairi Naresh : అయ్యప్ప దేవుడే లేడు… లేని దేవుడిని నేను టార్గెట్ చెయ్య…: భైరి నరేష్

Bairi Naresh : నాస్తికవాదిగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగా వైరల్ అవుతున్న వ్యక్తి బైరి నరేష్. అయ్యప్ప స్వాముల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బాగా వైరల్ అయ్యాడు. అయితే ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉంటానని కేవలం అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెబుతాను కానీ ఆ దేవుడికి కాదంటూ చెబుతారు నరేష్. దేవుడనే వాడు లేడని, మనిషికి మనిషి గౌరవం ఇచ్చుకోవలని, కులం-మతం అనేవి లేవంటూ ఆయన మాట్లాడుతారు. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి అయ్యప్ప స్వామి వివాదాస్పద వాఖ్యలను బైరి నరేష్ చేసారు.

అయ్యప్ప దేవుడు లేనేలేడు…

భైరి నరేష్ అయ్యప్ప స్వామి మీద తన వ్యాఖ్యలను సమర్తించుకుంటూ నేనేమి దేవుడిని ధూషించలేదు, కేవలం ప్రశ్నించాను. హరిహర పుత్ర అని వాళ్ళు అన్నపుడు లేదు కానీ ఇద్దరు మగ వాళ్లకు ఎలా జన్మించాడు అని ప్రశ్నిస్తే కించపరిచాను, తిట్టాను అంటున్నారు. అయ్యప్ప దేవుడు అనే వాడే లేనపుడు దేవుడికి నేనేందుకు క్షమాపణ చెప్పాలి. అయినా లేని దేవుడిని నేనేందుకు టార్గెట్ చేస్తాను.

నేను దేవుడు ఉన్నాడు అనే అపోహలో ఉన్న వాళ్లను దేవుడిని చూపించమని ప్రశ్నినిస్తున్నాను అంటూ అభిప్రాయపడ్డారు భైరి నరేష్. తాను ఎవరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదని, తన లక్ష్యం కేవలం కుల నిర్మూలన అలాగే మతం పేరిట జరిగే అన్యాయంను అరికట్టి చదువు వైపుకు అందరూ వెళ్ళాలని పోరాడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

8 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

9 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

9 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

1 day ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

1 day ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

1 day ago