Actress Maheswari: సినిమా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటే పాత హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తిరిగి తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఇండస్ట్రీలో గడుపుతున్నారు.
ఇలా ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలతో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించిన మహేశ్వరి గురించి అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనంతరం పెళ్లి సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకుంది.
అనంతరం రవితేజతో కలిసి నటించిన నీకోసం అనే సినిమాకు గాను ఈమె నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇలా గులాబీ, దెయ్యం, నీకోసం, పెళ్లి, ప్రియురాగాలు, మా అన్నయ్య,తిరుమల తిరుపతి వెంకటేశ వంటి సినిమాలలో నటించి సందడి చేసినటువంటి మహేశ్వరి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె 2008వ సంవత్సరంలో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
ఇలా వైవాహిక జీవితంలో స్థిరపడినటువంటి ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు ఇక దివంగత నటి శ్రీదేవికి సమీప బంధువు అయినటువంటి మహేశ్వరి ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ కెరియర్ కు చాలా అండగా నిలుస్తున్నారని ఆమె షూటింగ్ లొకేషన్లో తనకు తోడుగా పాల్గొంటూ తన కెరీర్ కు అండగా నిలుస్తున్నారని తెలుస్తుంది. అలాగే మంచి కథ పాత్రలు కనుక దొరికితే మహేశ్వరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…