Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా అభిమానులు తన భార్య అలేఖ్యరెడ్డి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు. జనవరి 27వ తేదీ పాదయాత్రలో భాగంగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.
ఈ విధంగా ఈయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించడంతో ఒక్కసారిగా ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది.ఇలా అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకుంటూ తనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తారకరత్నతో కలిసి చివరిగా తిరుమల వెళ్ళినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ నీతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు ఒక్కసారి నీ గొంతు వినాలని ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక తారకరత్న పెద్దకర్మ తర్వాత ఈమె గత ఏడాది సందర్భంగా తన భర్త తనకు రాసినటువంటి లవ్ లెటర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఇలా తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేక తరచు కంటతడి పెట్టుకుంటున్నటువంటి అలేఖ్య రెడ్డి గురించి తన పెద్ద కుమార్తె నిషిక చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే నిషిక తన తల్లి గురించి చెబుతూ అమ్మ నువ్వు చాలా బాధలో ఉన్నావు ఇంకొకసారి ఏడిస్తే నేను నీకు గుడ్ బై చెప్తా అని రాసి ఉన్నటువంటి పోస్టును అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…