సినిమా ఇండస్ట్రీలో నటిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మీ మంచు నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే నటి లక్ష్మీ మంచు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కామెంట్లు, చేయడంతో అది కాస్తా పలు వివాదాలకు కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం చాలామంది సినిమా సెలబ్రిటీలు తమ పేరిట యూట్యూబ్ చానల్స్ స్టార్ట్ చేసి హోమ్ టూర్స్, వివిధ రకాల వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం పరిపాటిగా మారిపోయింది.
తాజాగా నటి మంచు లక్ష్మి కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి హైదరాబాదులో తన ఉంటున్న ఇంటిని హోమ్ టూర్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తన ఇంటిని చూపించిన లక్ష్మి మంచు తన ఇంటిలోని వస్తువుల గురించి ప్రత్యేకించి అభిమానులకు తెలియజేశారు.
ముఖ్యంగా తన ఇంటిని చూపిస్తూ తనకు పెయింటింగ్స్ అంటే ఎంతో ఇష్టమని, తన ఇంటిలో ఉన్నటువంటి పెయింటింగ్స్ అన్నింటిని చూపించారు. అదేవిధంగా టీ కలెక్షన్, జువెలరీ కలెక్షన్, ఫోటో కలెక్షన్స్ అన్నింటిని ఈ వీడియో సందర్భంగా చూపించారు.అయితే కాలానికి అనుగుణంగా తన ఇంటిలో మార్పులు చేసుకుంటూ తన ఇష్టానికి అనుగుణంగా తన ఇంటిని తీర్చిదిద్దిన్నట్లు తెలిపారు.
ఇకపోతే ఈ సందర్భంగా మంచు లక్ష్మి యూఎస్‌లో ఉన్నప్పుడు తన ఇల్లు ప్రమాదానికి గురైందని,ఈ ప్రమాదంలో ఇల్లు మొత్తం కాలిపోయిన తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ మాత్రం మిగిలిందని, ఆ పెయింటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా లక్ష్మీ మంచు తెలియజేశారు . అలాగే తన ఇంటిలో ఉన్న డైనింగ్ టేబుల్ ప్రత్యేకతను ఈ వీడియో సందర్భంగా తెలియజేశారు. ఈ డైనింగ్ టేబుల్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల భోజనం చేయటం వల్ల దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…