Actress Manjima: టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్ . ఈ సినిమాలో మంజిమ నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా చెప్పుకొదగ్గ హిట్ అందుకోకపోవడంతో ఆ తర్వాత తెలుగు సినిమాలలో నటించే అవకాశం అందుకోలేకపోయింది.
మలయాళంలో మాత్రం చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించి అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా మలయాళీ సినిమాలలో నటించిన మంజుమా ఆ ఇండస్ట్రీకే పరిమితం అయింది.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఒక యువ హీరోతో ప్రేమలో ఉన్నట్లు మలయాళీ మీడియా నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మలయాళీ బ్యూటీ ప్రేమలో పడింది ఎవరితోనో కాదు..”కడలి” సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గౌతమ్ కార్తీక్ తో మంజిమ ప్రేమలో పడింది.
చాలాకాలంగా వీరిద్దరి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ వార్తలపై వీరిద్దరూ కూడా ఎక్కడా స్పందించలేదు. ఇక ఇటీవల వీరి ప్రేమ విషయం గురించి గౌతమ్ కార్తీక్ స్వయంగా వెల్లడించాడు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కార్తీక్ తన ప్రేమ విషయం బయట పెట్టాడు. ” ప్రేమకు అర్థమేంటో మంజిమ మోహన్‌ని చూశాకే తెలిసింది” అంటూ వారి మద్య ఉన్న ప్రేమ బంధాన్ని వెల్లడించాడు.
ఇంతకాలం గుట్టుగా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో తమ ప్రేమ విషయాన్ని ఎట్టకేలకు బయటపెట్టారు.
ఇలా వారి ప్రేమ విషయం అధికారికంగా ప్రకటించగానే వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తొందర్లోనే ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి ప్రేమా విషయం బయట పెట్టడంతో సెలబ్రిటీలు కూడా వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కడలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గౌతమ్ కార్తీక్ మరొక తెలుగు సినిమా ద్వారా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…