Pavala Shyamala : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన పావలా శ్యామల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ‘ఛాలెంజ్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె ఆ తరువాత ‘బాబాయ్ అబ్బాయి’ సినిమాతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ సినిమతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా చాలా సినిమాల్లో చేసిన పావలా శ్యామల ప్రస్తుతం వృధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక ఈమె పరిస్థితి చూసి చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు సహాయం చేసారు అంటూ వార్తలు వినిపించాయి. వీటన్నింటికీ క్లారిటీ ఇవ్వడానికే పావలా శ్యామల యూట్యూబ్ ఛానెల్ ను పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇంతవరకూ బ్రతికామంటే కారణం ఆయనే…
అనారోగ్యముతో ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న పావలా శ్యామల అని వార్తా పత్రికల్లో కథనాలు రావడంతో కొంతమంది ఫోన్ చేసి అడిగారు. ఎవరో కొందరు మాత్రం అకౌంట్ నెంబర్ ఇవ్వండి సహాయం చేస్తామని అడిగారట అంతే తప్ప ఇంకెవరూ పట్టించుకోలేదంటూ పావలా శ్యామల చెప్పారు. డైరెక్టర్ శివ నాగేశ్వర రావు స్నేహితుడు ఒకాయన వచ్చి ఏం మాట్లాడకుండా మీకు సహాయం చేయడానికి నాకు అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పి డబ్బులిచ్చారు. పేరు అడిగినా మీకు సహాయం చేయగలిగాను అది చాలు పేరు అది చెప్పడం వద్దు అని చెప్పారట. ఇప్పటివరకు అతను సహాయం చేసిన డబ్బుతోనే బ్రతికామంటూ పావలా శ్యామల చెప్పారు. అలా డబ్బులిచ్చిన మహానుభావులను చూసాను. ఇక ఐదు వేలు ఇచ్చి జాగ్రతగా ఖర్చు పెట్టు, నువ్వు నీ కూతురు హాయిగా ఉండండి ఈ డబ్బుతో, దుబార ఖర్చు పెట్టకు వాటికి వీటికి అని చెప్పిన ప్రబుద్ధులను చూసాను అంటూ శ్యామల చెప్పారు.
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు కి నా పరిస్థితి తెలియదా. ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇలాంటి పరిస్థితిలో ఉంటే కనీసం బ్రతికిందా చచ్చిందా అని కూడా అడగరా అంటూ ఎవరూ నాకు సహాయం చేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం వేరేలా ఉంది అంటూ చెప్పారు. ఇక నా పరిస్థితికి పెయిడ్ ఆశ్రమంలో ఎందుకు ఉచితంగా ఉండేవాటిలో ఉండవచ్చు అంటూ చాలా మంది అన్నారు. ఇక్కడే వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి ఇక ఉచిత ఆశ్రమంలో ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఒక ఆర్టిస్ట్ గా మంచి జీవితం చూసిన నేను ఇలాంటి పరిస్థితి రావడం వల్ల ఇలా బ్రతకాల్సి వస్తోంది. ఇంతకంటే దిగజారి బ్రతకాలంటే నావల్ల కాదు, ఎవరో ఏదో అనుకుంటారని అలాంటి బ్రతుకు నేను బతకలేను, దానికంటే నేను ఆత్మహత్య చేసుకుని మరణించడం ఉత్తమం అంటూ ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…