Pavala Shyamala : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన పావలా శ్యామల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ‘ఛాలెంజ్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఆ తరువాత ‘బాబాయ్ అబ్బాయి’ సినిమాతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ సినిమతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా చాలా సినిమాల్లో చేసిన పావలా శ్యామల ప్రస్తుతం వృధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన కూతురు కూడా ఆరోగ్య సమస్యలతో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి కష్టకాలంలో ఆదుకోడానికి అని వచ్చి కరాటే కళ్యాణి మీడియాతో పావలా శ్యామల మీద మాట్లాడిన మాటలు నచ్చక ఆమె సహాయం అవసరం లేదని నిరాకరించారు పావలా శ్యామల. ఇక అసలు ఏం జరిగిందనే విషయాలను తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివరించారు పావలా శ్యామల.
కరాటే కళ్యాణి మాటలకు నాకే అసహ్యం వేసింది…
సహాయం చేయడానికి నన్ను పరామర్శించడానికి వచ్చిన కరాటే కళ్యాణి నా ఇంట్లో శుభ్రంగా లేదంటూ మాట్లాడింది. వాసన వస్తోందంటూ మీడియా ముందు చెప్పడం నాకే అసహ్యం వేసింది. తన సహాయం వద్దు ఏం వద్దు ఇలాంటి మాటలు వినాలా అనిపించింది. నాకు చేతకాని పరిస్థితిలో నేను ఉంటే నా కూతురుకి కాళ్ళు లేక ఇబ్బందులు పడుతుంటే ఇల్లు శుభ్రంగా లేదని మాట్లాడటం నాకు నచ్చలేదు అంటూ చెప్పారు. ఇక ఒక పెయిడ్ ఆశ్రమంలో ఉంటోన్న పావలా శ్యామల ఉచిత ఆశ్రమాల్లో ఉండొచ్చు కానీ నా బిడ్డకు ఇబ్బంది కలుగుతుందనే తిండి సరిగా ఉండటం లేదనే ఉద్దేశంతోనే ఇలా పెయిడ్ ఆశ్రమలో ఉంటున్నాం.
ఇక్కడ సరిగా లేదు కానీ ఉంటున్నాం. అంటూ తనకు గుండెకు రంధ్రాలు ఉన్నాయని ఎంతకాలం బతుకుతానో తెలియదంటూ చెబూతూ నా బిడ్డ గురించి నా దిగులు, మంచం మీద నుండి కదల్లేని పరిస్థితిలో ఉన్న తనను ఎవరు చూసుకుంటారు అంటూ ఎమోషనల్ అయ్యారు. కొద్దిరోజుల్లో మరణిస్తాను అన్న పరిస్థితి లో ఉన్న నామీద విమర్శలు చేస్తున్న కళ్యాణి లాంటి వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదు, ఆ విషయాలను వివరించే ఓపిక కూడా నాకు లేదు అంటూ పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…