Actress Nagma: పెరుగుతున్న సాంకేతిక టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు బాగా చదువుకొని సంపాదించే వారిని సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.
నటి నగ్మా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె తాను మోసపోయిన విషయాన్ని తెలియచేశారు.తనకు తన మొబైల్ నంబర్ కు ఒక బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిందని తెలిపారు. అయితే ఆ బ్యాంక్ మెసేజ్ క్లిక్ చేయగానే తనకు ఫోన్ వచ్చిందని అవతల వ్యక్తి తాను బ్యాంక్ ఉద్యోగిని అంటూ పరిచయం చేసుకున్నారని తెలిపారు.
ఇలా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మాట్లాడిన ఆ వ్యక్తి కేవైసీ అప్డేట్ చేయాలని అడిగారు. అయితే అప్పటికి తాను తన వివరాలను ఇవ్వకపోయినప్పటికీ సదరు వ్యక్తి ఆన్లైన్లోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోలాగిన్ అయ్యారని తెలుస్తుంది. ఇలా అవతల వ్యక్తి లాగిన్ అయ్యే సమయంలో దాదాపు తనకు 20 వరకు ఓటీపీలు వెంట వెంటనే వచ్చాయని నగ్మా తెలిపారు.
ఇలా వెంటనే ఓటీపీలు వచ్చిన తర్వాత తన అకౌంట్ నుంచి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఈమె వెల్లడించారు.అయితే సెలబ్రిటీలు అన్న తర్వాత వారి అకౌంట్లో భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది కానీ ఈమె అకౌంట్ నుంచి లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడంతో కాస్త బాధలో కూడా ఊపిరి పీల్చుకున్నాను అని ఈమె తెలిపారు. ఇక వెంటనే తాను ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశానని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…